తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

ఊపిరాడక జనం చస్తుంటే పన్నులా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటం, జనం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణవాయువు కోసం జనం ఎయిర్ ప్యూరిఫైర్లను కొనుగోలు చేస్తుంటే.. వాటిపై కూడా జీఎస్టీ (GST) వసూలు చేయడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.

కాలుష్యంతో జనం నరకం చూస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ వేస్తారా?” అంటూ మండిపడింది. అత్యవసరమైన వస్తువుల జాబితాలోకి వచ్చే వీటిపై పన్ను ఎందుకు తొలగించలేదో చెప్పాలని నిలదీసింది. దీనిపై మధ్యాహ్నం 2:30 గంటలకల్లా కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Comment