తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక కొత్త ‘సిట్’ (SIT – Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు.
కొత్త సిట్ బాధ్యతలు చేపట్టిన వెంటనే విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం రాబట్టేందుకు విచారణ జరుపుతున్నారు.