పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. మళ్ళీ అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి చెందడంతో వేలాది మంది విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. భారత్ మరియు అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఢాకాలోని క్వాన్ బజార్‌లో ఉన్న ప్రముఖ పత్రిక ‘డైలీ స్టార్’ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కార్యాలయం లోపల సుమారు 25 మంది జర్నలిస్టులు చిక్కుకుపోగా, స్థానికులు సాహసోపేతంగా వారిని కాపాడి బయటకు తీసుకొచ్చారు.