తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

భారత్‌తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట

భారత్‌తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా ఉండాలంటే పొరుగు దేశమైన భారత్‌తో సత్సంబంధాలు ఎంతో అవసరమని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు.

ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యం మరియు ఆర్థిక సహకారం విషయంలో భారత్ తమకు కీలక మిత్రదేశమని ఆయన పేర్కొన్నారు.

Leave a Comment