తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాటున డ్రగ్స్ దందా.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేడీ టెక్కీ అరెస్ట్!

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న సుష్మిత అనే యువతి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది.

పక్కా సమాచారం అందడంతో పోలీసులు బుధవారం ఉదయం వారి నివాసంపై దాడి చేసి సుష్మితను అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Comment