ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేసిన మహనీయుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత ఆయనది.
“తెలంగాణ బిడ్డగా దేశ ఖ్యాతిని పెంచిన పీవీ సేవలు చిరస్మరణీయమని” పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు.