తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకారులపై లాఠీచార్జ్!

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీహెచ్‌పీ (VHP) మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

Leave a Comment