న్యూ ఇయర్ జోష్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 100 చోట్ల చెక్ పోస్టులు, 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు.
తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, మరియు 6 నెలల జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే రోడ్లపై రేసింగ్, వీలింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు