చలి తీవ్రత పెరగడంతో చాలామంది చర్మం పొడిబారి ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఖరీదైన క్రీములు వాడాల్సిన పనిలేదు. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె రాసుకుని, గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే, చలికాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేటెడ్ గా మెరుస్తుందని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.