ఏపీ రాజకీయాల్లో ‘రెడ్ బుక్’ (Red Book) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి నారా లోకేష్ దీనిపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రెడ్ బుక్‌లో కేవలం మూడు పేజీల అమలు మాత్రమే పూర్తయ్యిందని, ఇంకా చాలా అంశాలు మిగిలే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను ఈ బుక్‌లో నమోదు చేసిన విషయం తెలిసిందే. “చట్టాన్ని అతిక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు” అని లోకేష్ మరోసారి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.