మంచి జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ యువతి నేరాల బాట పట్టింది. విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేయగా, అందులో ఓ యువతి ఉండటం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సదరు యువతి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేది. జల్సాలకు అలవాటు పడి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలిపింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితుల నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత ఇలాంటి అడ్డదారుల్లో వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.