తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

ఆలయంలో అన్నదానం చేసిన మమ్ముట్టి

కొచ్చి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం కేరళలోని కొచ్చిలో ఆవిష్కృతమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొచ్చిలోని ప్రసిద్ధ ఎర్నాకుళతప్పన్ ఆలయాన్ని సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. ఆలయ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు త‌న చేతుల‌తో భోజనం వడ్డించారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, హిందూ ఆలయ ఉత్సవాల్లో పాలుపంచుకుని సేవ చేయడం ద్వారా ఆయన కులమతాలకు అతీతంగా అందరి హృదయాలను గెలుచుకున్నారు.

గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!

అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు ఇంజిన్, 5 బోగీలు పట్టాలు తప్పాయి.

లంచాల కక్కుర్తి.. అడిషనల్ కలెక్టర్‌పై సీఎం రేవంత్ సీరియస్!

భూ సమస్యల పరిష్కారానికి లంచాలు అడుగుతున్నారని రైతుల ఫిర్యాదు. అడిషనల్ కలెక్టర్‌ తీరుపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

భారత్‌తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట

భారత్‌తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా ఉండాలంటే పొరుగు దేశమైన భారత్‌తో సత్సంబంధాలు ఎంతో అవసరమని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యం మరియు ఆర్థిక … Read more

ఊపిరాడక జనం చస్తుంటే పన్నులా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటం, జనం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణవాయువు కోసం జనం ఎయిర్ ప్యూరిఫైర్లను కొనుగోలు చేస్తుంటే.. వాటిపై కూడా జీఎస్టీ (GST) వసూలు చేయడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. కాలుష్యంతో జనం నరకం చూస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ వేస్తారా?” అంటూ మండిపడింది. అత్యవసరమైన వస్తువుల జాబితాలోకి వచ్చే వీటిపై పన్ను ఎందుకు తొలగించలేదో చెప్పాలని … Read more

బంగ్లాదేశ్‌లో మళ్ళీ భగ్గుమన్న అల్లర్లు.. జర్నలిస్టుల ఆఫీసుపై దాడి!

పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. మళ్ళీ అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి చెందడంతో వేలాది మంది విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. భారత్ మరియు అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఢాకాలోని క్వాన్ బజార్‌లో ఉన్న ప్రముఖ పత్రిక ‘డైలీ స్టార్’ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి … Read more

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించారు. కార్తీక మాసం మరియు అయ్యప్ప సీజన్ కావడంతో ఆయన నిష్టగా దీక్షను పాటిస్తున్నారు. తాజాగా ఆయన తన నివాసంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో, మెడలో మాలలతో స్వామివారిని అర్చిస్తున్న సీఎం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేసినట్లు సన్నిహితులు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి కొత్త సిట్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక కొత్త ‘సిట్’ (SIT – Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త సిట్ బాధ్యతలు చేపట్టిన వెంటనే విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. … Read more

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాటున డ్రగ్స్ దందా.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేడీ టెక్కీ అరెస్ట్!

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న సుష్మిత అనే యువతి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు బుధవారం ఉదయం వారి నివాసంపై దాడి చేసి సుష్మితను అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న … Read more

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో సందడి.. యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ!

కుషాయిగూడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్-1 అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్, సంయుక్త కార్యదర్శి సుమన్, ముఖ్య సలహాదారు సి.హెచ్ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఎప్పుడూ ముందుంటుందని, కొత్త సంవత్సరంలో డిపో అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాన కార్యదర్శి దాయర శ్రీనివాస్ మరియు … Read more