మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మళ్ళీ భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,000 దాటింది. వెండి ధర కూడా కిలో లక్ష రూపాయలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులే దీనికి కారణమని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.