గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు ఇంజిన్, 5 బోగీలు పట్టాలు తప్పాయి.
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు ఇంజిన్, 5 బోగీలు పట్టాలు తప్పాయి.
భారత్‌తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా ఉండాలంటే పొరుగు దేశమైన భారత్‌తో సత్సంబంధాలు ఎంతో అవసరమని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యం మరియు ఆర్థిక … Read more
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటం, జనం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణవాయువు కోసం జనం ఎయిర్ ప్యూరిఫైర్లను కొనుగోలు చేస్తుంటే.. వాటిపై కూడా జీఎస్టీ (GST) వసూలు చేయడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. కాలుష్యంతో జనం నరకం చూస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ వేస్తారా?” అంటూ మండిపడింది. అత్యవసరమైన వస్తువుల జాబితాలోకి వచ్చే వీటిపై పన్ను ఎందుకు తొలగించలేదో చెప్పాలని … Read more
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. మళ్ళీ అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి చెందడంతో వేలాది మంది విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. భారత్ మరియు అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఢాకాలోని క్వాన్ బజార్‌లో ఉన్న ప్రముఖ పత్రిక ‘డైలీ స్టార్’ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి … Read more
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీహెచ్‌పీ (VHP) మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.