ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే అంశంపై ఆరా తీయనున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు, రేషన్ పంపిణీపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.