తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్

మంచి పాలన అందించండి.. కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ పిలుపు!

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. “మీరంతా ప్రజల మనసులను గెలుచుకుని, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి,” అని ఆయన ఆకాంక్షించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి పాలన అందించాలని ట్విట్టర్ వేదికగా సీఎం సందేశం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోనే రాష్ట్ర ప్రగతి దాగి ఉందని ఆయన గుర్తుచేశారు.

Leave a Comment