మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడ్డ భర్త రాజును, తన తీరు మార్చుకోవాలని భార్య మందలించడమే ఆమె పాలిట శాపంగా మారింది. నిన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, విసిగిపోయిన భార్య తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది.
మార్గమధ్యలో ఆమెను అడ్డగించిన భర్త, విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.