కుషాయిగూడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్-1 అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్, సంయుక్త కార్యదర్శి సుమన్, ముఖ్య సలహాదారు సి.హెచ్ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఎప్పుడూ ముందుంటుందని, కొత్త సంవత్సరంలో డిపో అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాన కార్యదర్శి దాయర శ్రీనివాస్ మరియు అంబేడ్కర్ సంఘం నాయకులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.