భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ మరోసారి సత్తా చాటింది. మలేషియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో చైనా జోడీని చిత్తు చేసి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. వచ్చే ఒలింపిక్స్లో పతకం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.